Skip to main content

Andhra Pradesh : పెన్షన్‌ పెంచుతూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం.. అలాగే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. డిసెంబ‌ర్ 13వ తేదీన (మంగ‌ళ‌వారం) సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావే­శ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రధానంగా పెన్షన్‌ పెంపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల జ‌న‌వ‌రి నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు కానుంది.

అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో..
మరొకవైపు వైఎస్సార్‌ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్‌ క్లాస్‌లు, ఫౌండేషన్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదన​కు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.

Published date : 13 Dec 2022 05:36PM

Photo Stories