AP Cabinet: విజయనగరం జేఎన్టీయూకు ఎవరి పేరును పెట్టనున్నారు?
Sakshi Education
- 2021, నవంబర్ 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 19న సచివాలయంలో సమావేశమైన పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా..
- ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు 432 కొత్త 104 వాహనాలు కొనడానికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు పాలనాపరమైన అనుమతులు మంజూరు. ఇందుకోసం రూ. 107.16 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.
- విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమి... గిరిజన మ్యూజియం, బొటానికల్ గార్డెన్, టూరిజం డెవలప్‌మెంట్‌కు కేటాయింపు.
- ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
- ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలకు ఆమోదం. కేటాయించిన ఇంటి çస్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతి.
- శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీని మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లుకు ఆమోదం
- రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటుకు, ఈఏఎఫ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించి చట్టంలో సవరణల బిల్లుకు ఆమోదం.
- ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం
- జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ యాక్ట్‌కు సంబం«ధించిన సవరణ బిల్లుకు ఆమోదం. విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరు విజయనగరం జేఎన్టీయూ జీవీ (గురజాడ విజయనగరం)గా మార్పు.
- ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 చట్టంలో సవరణలకు ఆమోదం.
- వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ 1971లో సవరణల బిల్లుకు ఆమోదం
చదవండి: దేశంలోని ఏ రాష్ట్రంలో రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటు కానుంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 20 Nov 2021 04:18PM