Skip to main content

Tribal Museum: దేశంలోని ఏ రాష్ట్రంలో రాంజీ గోండ్‌ మ్యూజియం ఏర్పాటు కానుంది?

Tribal museum

గిరిజన, ఆదివాసీల్లోని మహానేతల స్మృతికి చిహ్నంగా, వారి చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియాలను నిర్మించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలో... స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల హక్కుల ఉద్యమకారుడు రాంజీ గోండ్‌ పేరిట మ్యూజియం ఏర్పాటుకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.18 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. మ్యూజియం నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు నవంబర్‌ 15న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ట్రైబల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(టీఆర్‌ఐ) ఆధ్వర్యంలో మ్యూజియం నిర్మాణానికి సంబంధించి నమూనా రూపుదిద్దుకుంటోంది. ఈ మ్యూజియానికి కేంద్రం రూ.15 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు ఇస్తోంది.
 

చ‌ద‌వండి: ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల హక్కుల ఉద్యమకారుడు రాంజీ గోండ్‌ పేరిట మ్యూజియం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్‌ 15
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ    : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : గిరిజన–ఆదివాసీల్లోని మహానేతల స్మృతికి చిహ్నంగా, వారి చరిత్ర, సంస్కృతిని తెలిపేందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Nov 2021 05:07PM

Photo Stories