Inter-State Issues: ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. నవంబర్ 9న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్(ఒడిశా సచివాలయం)లో జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా నలుగుతున్న వంశధార, జంఝావతి జల వివాదాలు, సరిహద్దు సమస్య.. బలిమెల, అప్పర్ సీలేరులో జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్‌వోసీలు తదితర అంశాలపై చర్చలు జరిపారు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంతోపాటు గంజాయి సాగు, అక్రమ రవాణాను నివారించేందుకు సమష్టిగా కృషి చేయాలని నిశ్చయించారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
చదవండి: భారత నావికా పితామహుడిగా ఎవరిని భావిస్తారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్ పట్నాయక్
ఎక్కడ : లోక్‌సేవా భవన్, భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్