Father of the Indian Navy: భారత నావికా పితామహుడిగా ఎవరిని భావిస్తారు?
డిసెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే భారత నావికాదళ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పు నౌకాదళం ఆహ్వానించింది. నవంబర్ 5న తాడేపల్లిలోని సీఎం నివాసంలో తూర్పు నౌకా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ఇతర నౌకాదళ అధికారులతో పాటు సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేవీ డే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ముంబైలో నిర్మిస్తున్న యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
నేవీ డే కథ...
బంగ్లాదేశ్ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్–పాక్ మధ్య 1971 డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్ 4న పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న ‘భారత నౌకాదళ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. 17వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లేను ‘భారత నావికా పితామహుడిగా(ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ)‘ భావిస్తారు.
చదవండి: దేశంలోని ఏ నగరంలో ప్లగ్ అండ్ ప్లే సెంటర్ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిసెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే భారత నావికాదళ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : తూర్పు నౌకా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్
ఎక్కడ : తాడేపల్లి, గుంటూరు జిల్లా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్