Visakhapatnam: దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
South Coast Railway zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి 25న రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ మేరకు బదులిచ్చారు. ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్ (విశాఖ రైల్వే జోన్)కు డీపీఆర్ సమర్పించాక కొత్త రైల్వేజోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను పరిశీలించడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశాం.’ అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకోసం 2020–21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
Tilapia Fish: తెలంగాణలో ఫిష్ కల్చర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్న సంస్థ?
AC Manufacturing Unit: రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్