Tilapia Fish: తెలంగాణలో ఫిష్ కల్చర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్న సంస్థ?
తిలాపియా చేపల ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీ ‘ఫిష్ ఇన్’.. తెలంగాణ మత్స్య రంగంలో వేయి కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో సుమారు 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు మార్చి 24న ఫిష్ ఇన్ కంపెనీ చైర్మన్, సీఈఓ మనీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. రూ.వేయి కోట్ల పెట్టుబడితో తెలంగాణలో సమీకృత మంచినీటి చేపల పెంపకం వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్‌వాటర్ ఫిష్ కల్చర్ సిస్టమ్)ను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మనీష్ ప్రకటించారు.
AC Manufacturing Unit: రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది?
ఫిష్ ఇన్ సీఈఓ మనీష్ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ఇన్ కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. చేపల ఉత్పత్తిలో హేచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్, ఎగుమతులు వంటి విభాగాల్లో ‘ఫిష్ ఇన్’కార్యకలాపాలు కొనసాగుతాయి.
హైదరాబాద్‌లో ‘కన్‌ఫ్లూయెంట్’యూనిట్..
వైద్య ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ‘కన్‌ఫ్లూయెంట్ మెడికల్’హైదరాబాద్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. శాన్‌హోలో కేటీఆర్‌తో భేటీ అనంతరం సంస్థ అధ్యక్షుడు, సీఈవో డీన్ షావర్ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించారు.
IGGCARL: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఆగ్రోఎకాలజీ సెంటర్ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ మత్స్య రంగంలో వేయి కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించిన కంపెనీ?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : ఫిష్ ఇన్
ఎందుకు : తెలంగాణలో సమీకృత మంచినీటి చేపల పెంపకం వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్‌వాటర్ ఫిష్ కల్చర్ సిస్టమ్)ను అభివృద్ధి చేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్