Skip to main content

IGGCARL: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఆగ్రోఎకాలజీ సెంటర్‌ ఏర్పాటు కానుంది?

Farming

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో త్వరలో అంతర్జాతీయస్థాయి సేంద్రియ సాగు పరిశోధన కేంద్రం.. ఇండో జర్మన్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీసీఏఆర్‌ఎల్‌) ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ తెలిపారు. సీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రైతుల్లో సేంద్రియ సాగు పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించి, పరిశోధన ఫలితాలను అందించటానికి ఐజీజీసీఏఆర్‌ఎల్‌ దోహదపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.48.50 కోట్లు, జర్మనీ రూ.174.2 కోట్లు అందిస్తాయి. జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  చేతుల మీదగా పులివెందులలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది.

Telangana: క్వాల్కమ్‌ నూతన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?

23 శాతం పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బానిసలు
దేశంలో 23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్‌ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మార్చి 23న లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.

CM YS Jagan: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పవర్‌లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటు కానుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
త్వరలో ఇండో జర్మన్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీసీఏఆర్‌ఎల్‌) ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ
ఎక్కడ    : పులివెందుల, వైఎస్సార్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : రైతుల్లో సేంద్రియ సాగు పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించి, పరిశోధన ఫలితాలను అందించటానికి..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 24 Mar 2022 06:55PM

Photo Stories