Skip to main content

Swachh Survekshan: తెలంగాణకు మరో 7 ‘స్వచ్ఛ’ అవార్డులు

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఏడు పట్టణాలకు చోటు దక్కింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ విభాగంలో 16 అవార్డులు రాగా, ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది.

తాజాగా కాగజ్‌నగర్, జనగామ, ఆమన్‌గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్‌ వరంగల్‌ పురపాలికలకు ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ సిటీస్‌ (వేగంగా ఎదుగుతున్న నగరాలు) కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో తెలంగాణ మొత్తం 26 అవార్డులను సాధించినట్లయింది. 
4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే..
స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్‌ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుధ్యం, మున్సిపల్‌ ఘన..ద్రవ వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశ వ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ఉమ్మి రహిత వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్‌ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు.. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, ద్రవ..వ్యర్ధాల నిర్వహణ, ప్రజల అవగాహన, సిటిజెన్స్‌ ఎంగేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్‌ తదితర అంశాలు పరిశీలించారు.  జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచి్చన పట్టణాలకు ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించారు. 

➤ దేశంలో ఎక్కువ అవార్డులు సాధించిన రెండో రాష్ట్రం తెలంగాణ

Published date : 26 Nov 2022 02:11PM

Photo Stories