Skip to main content

AP State Economy: ‘నికరం’గా ఆర్థికవృద్ధి!

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మూ డేళ్లుగా వృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆర్థిక వృద్ధికి ప్రధానంగా వ్యవసాయం, తయా­రీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు వెన్నుద­న్నుగా నిలుస్తున్నాయి.
RBI statistical report 2022
RBI statistical report 2022

ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2021–22 ఆర్థిక ఏడాది నాటికి రాష్ట్ర ఆర్థిక నికర విలువ (నెట్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌) రికార్డు స్థాయిలో రూ.10.85 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఆర్థిక మందగమనం, వరుసగా రెండేళ్ల పాటు కరోనా సంక్షోభ పరిస్థితులను అధిగమించి గత మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక నికర విలువ 37.28 శాతం మేర పెరిగింది.

Also read: India's economy: భారత్‌ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్‌ అంచనా తగ్గింపు

 దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి రూపొందించిన గణాంకాల నివేదికలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ అంశాలను వెల్లడించింది. 

సంక్షోభంలో అండగా..
2021–22 ఆర్థిక ఏడాదిలో వివిధ రాష్ట్రాలు ఆర్ధిక కార్యకలాపాల ద్వారా జోడించిన రాష్ట్ర నికర  విలువలను ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ వేగంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది. ప్రస్తుత ధరల ప్రకారం 2018–19లో రాష్ట్ర ఆర్థిక నికర విలువ రూ.7.90 లక్షల కోట్లు మాత్రమే ఉండగా 2021–22 నాటికి రూ.10.85 లక్షల కోట్లకు చేరిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. మూడేళ్లలో నికర రాష్ట్ర ఆర్థిక విలువ రూ.2.94 లక్షల కోట్లు  పెరిగింది. అంటే మూడేళ్లలో 37.28 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. సగటు వార్షిక వృద్ధి 12.42 శాతంగా ఉంది. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 16th కరెంట్‌ అఫైర్స్‌

జీఎస్‌డీపీ రూ.12,01,736 కోట్లు
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రస్తుత ధరల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.12,01,736 కోట్లుగా నమోదైంది. 

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్‌ను ఏ MF హౌస్ ప్రారంభించింది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 19 Sep 2022 06:46PM

Photo Stories