Andhra Pradesh: భోగరాజు సీతారామయ్య మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
తెలుగు వారి గొప్పదనాన్ని చాటి చెప్పిన ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఓ మ్యూజియం, అతి పెద్ద కన్వెన్షన్ హాలు నిర్మించనుంది. మ్యూజియం ఏర్పాటుకు అవసరమైన ఎకరంన్నర భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మ్యూజియం, కన్వెన్షన్ హాలు నిర్మాణానికి అవసరమైన రూ.40 కోట్లను ఆంధ్రా బ్యాంకును విలీనం చేసుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌రాయ్ విరాళంగా ప్రకటించారు. 1923, నవంబర్ 23న స్థాపించిన ఆంధ్రా బ్యాంక్‌ను ఇటీవలి కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు.
Andhra Pradesh: జగనన్న తోడు మూడో విడత కింద ఎంత మొత్తాన్ని విడుదల చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరున మ్యూజియం, అతి పెద్ద కన్వెన్షన్ హాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : మచిలీపట్నం, కృష్ణా జిల్లా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్