Skip to main content

IT Minister KTR: మైక్రోసాఫ్ట్‌ భారీ డేటా సెంటర్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?

Microsoft

దేశీయంగా డిజిటల్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అతి పెద్ద డేటా సెంటర్‌ రీజియన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా నిర్మిస్తున్న ఈ సెంటర్‌లో మొదటి ఫేజ్‌ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో ఇది ఏర్పాటు అవుతుంది. ఈ విషయాలను మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో కలిసి మార్చి 7న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు.

భారత్‌లో నాలుగోది..
మైక్రోసాఫ్ట్‌కి ఇప్పటికే పుణే, ముంబై, చెన్నైలో మూడు డేటా సెంటర్‌ రీజియన్లు ఉండగా .. హైదరాబాద్‌లోని నాలుగోది కానుంది. ఇది కంపెనీలు, స్టార్టప్‌లు, డెవలపర్లు, ప్రభుత్వ సంస్థలు మొదలైన క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం) తదితర సొల్యూషన్స్‌ అందించనుంది. సాధారణంగా ఇలాంటి డేటా సెంటర్‌ ఏర్పాటుకు కనీసం 24 నెలలు పడుతుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి చెప్పారు. క్రమంగా ఇన్వెస్ట్‌ చేస్తూ దీన్ని అతి పెద్ద సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

FM Nirmala Sitharaman: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నాసిన్‌ను ఏర్పాటు చేయనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మైక్రోసాఫ్ట్‌ భారీ డేటా సెంటర్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : మార్చి 7
ఎవరు    : మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సీఆర్‌ఎం తదితర సొల్యూషన్స్‌ అందించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Mar 2022 01:29PM

Photo Stories