Skip to main content

Jagananna Thodu scheme : ఆ కష్టం రావొద్దనే ఈ పథకం తెచ్చాం.. సీఎం జగన్‌

చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని, అందుకే వాళ్లకు అండగా నిలిచామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

జ‌న‌వ‌రి 11వ తేదీ (బుధ‌వారం) క్యాంప్‌ కార్యాలయంలో జగనన్న తోడు పథకంలో భాగంగా.. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల నగదు జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. 

ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారాయన. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని ఉద్ఘాటించారాయన.

లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ఈరోజే..
‘‘పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

ఆరో విడుత నగదును..

Jagananna Thodu scheme Details in telugu

ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా.. సీఎం జగన్‌ సంతోషించారు. ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్‌ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు.

Published date : 11 Jan 2023 01:06PM

Photo Stories