Telangana: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది?
ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, విధానాలను వారికి చేరవేయడం వంటి అంశాలపై అధికారులతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనాకేంద్రాలలో పరిశోధనలు జరగాలన్నారు. అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో కంది విత్తన పరిశోధనాకేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు.
హైదరాబాద్‌లో ‘బాష్’ సాఫ్ట్‌వేర్ సెంటర్..
హైదరాబాద్‌లో తమ సాఫ్ట్‌వేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ, జర్మనీకి చెందిన ‘బాష్’ ప్రకటించింది. దీని ద్వారా హైదరాబాద్ కేంద్రంగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు కంపెనీ సీనియర్ ప్రతినిధులతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఫిబ్రవరి 8న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొబిలిటీ, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్, గృహోపకరణాల రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా ‘బాష్’కు పేరుంది.
చదవండి: చేదోడు పథకం కింద ఎంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి
ఎక్కడ : ఆదిలాబాద్
ఎందుకు : పత్తి పంటపై పరిశోధనలు చేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్