YSRCP : వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్.. కారణం ఇదే..
ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారాయన. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని చెప్పారు సజ్జల.
➤☛ Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. రాహుల్‌పై ఉన్న కేసు ఏమిటీ?
క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపాం. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారు. మాకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోంది. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారు. క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు అని సజ్జల మీడియాకు వివరించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరం..
ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టమే. రోగ కారణాన్ని తక్షణం గుర్తించి ఇలాంటి వాటిని తొందరగా తొలగించుకోవాలి. అందుకే మా పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరం. అందుకే వారితో అవసరం లేదని తొలగించాం. ఆ నలుగురూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని పార్టీ నమ్మింది కాబట్టే సస్పెండ్ చేశాము. కేవలం అసంతృప్తి వల్ల ఎవరూ బయటకు వెళ్లిపోరు. ప్రలోభాలకు గురిచేస్తేనే వారు క్రాస్ ఓటింగ్ చేశారు. కానీ, తెదేపా నుంచి వచ్చిన వాళ్లు మాపై అభిమానంతో వచ్చారు.