Skip to main content

Andhra Pradesh: పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఎక్కడ ప్రారంభించారు?

Kadapa RIMS

వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పగిరి కంటి ఆస్పత్రి(పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌)ని ఫిబ్రవరి 20న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. 2.05 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ప్రారంభించడం ద్వారా ప్రజలకు అత్యాధునిక కంటి వైద్యం అందుబాటులోకి వచ్చింది.

విశాఖలో రాష్ట్రపతి..

భారత నౌకాదళ శక్తి పాటవాలను సమీక్షించేందుకు సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేరుకున్నారు. ఫిబ్రవరి 20న ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఫిబ్రవరి 21న విశాఖలో ప్రారంభమయ్యే ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌)లో  ప్రెసిడెన్షియల్‌ యాచ్‌గా ఉన్న ఐఎన్‌ఎస్‌ సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి కోవింద్‌ సమీక్షించనున్నారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి.

చ‌ద‌వండి: రాష్ట్రంలో కేంద్రీకృత వంటశాలను ఎక్కడ ప్రారంభించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పుష్పగిరి కంటి ఆస్పత్రి(పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌) ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : రిమ్స్, కడప, వైఎస్సార్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ప్రజలకు అత్యాధునిక కంటి వైద్యం అందించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Feb 2022 04:32PM

Photo Stories