Andhra Pradesh: రాష్ట్రంలో కేంద్రీకృత వంటశాలను ఎక్కడ ప్రారంభించారు?
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వంటశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 18న ప్రారంభించారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల్లో 50,000 మందికి భోజనం అందించేలా ఈ వంటశాలను నిర్మించారు. అలాగే ఈ వంటశాలలో తయారైన ఆహార పదార్థాలు వేడి తగ్గకుండా, నాణ్యత దెబ్బతినకుండా వేగంగా పాఠశాలలకు అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఎయిర్ ఇండియా సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ఈ కేంద్రీకృత వంటశాలను (సెంట్రలైజ్డ్ కిచెన్) అభివృద్ధి చేసింది.
గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు భూమి పూజ
గుంటురూ జిల్లా, తాడేపల్లి మండలం, కొలనుకొండలో ఇస్కాన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. సుమారు ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన రూ.70 కోట్ల వ్యయంతో ఈ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు.
నకిలీ మార్కెట్ల జాబితాలో ఇండియమార్ట్..
‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ను యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 ఆన్‌లైన్, 35 భౌతిక మార్కెట్లకు ఇందులో చోటు కల్పించింది. ఇవన్నీ పెద్ద ఎత్తున నకిలీ ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘనకు వీలు కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. భారత్‌కు చెందిన బీటుబీ ఈ కామర్స్ పోర్టల్ ఇండియమార్ట్.కామ్‌ను ఈ జాబితాలోకి చేర్చింది. భారత్ నుంచి మరో నాలుగు మార్కెట్లు.. ముంబైలోని హీరా పన్నా, ఢిల్లీలోని ట్యాంక్ రోడ్, పాలికా బజార్, కోల్‌కతాలోని కిడ్డర్‌పోర్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
చదవండి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం అమెరికా సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రీకృత వంటశాల (సెంట్రలైజ్డ్ కిచెన్) ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆత్మకూరు, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా
ఎందుకు : రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట నాణ్యమైన భోజనం అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్