Skip to main content

Varikapudisela Lift Irrigation Scheme: వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం

పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు.
CM Jagan lay Stone for Varikapudisela Lift Irrigation Scheme

‘వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపట్ట­నున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సీఎం జగన్‌ పనులను ప్రారంభించనున్నారు.

AP Medtech Zone: ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు అరుదైన గుర్తింపు

ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్‌ ఇదే

రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా అయ్యేలా 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.  

 

Tirupati District: అగ్రికల్చర్ సేవల్లో ప్రథమ స్థానంలో తిరుపతి జిల్లా

Published date : 15 Nov 2023 05:14PM

Photo Stories