Skip to main content

Araku coffee at G20 Summit: జీ–20లో అరకు కాఫీ

 అరకు క్యాఫీ ఖ్యాతి దేశ, విదేశాలకు వ్యాపించింది. న్యూఢిల్లీలో జరిగిన జి – 20 సమ్మిట్‌ ఇందుకు వేదికగా నిలిచింది.
Araku coffee at G20 Summit, Global Recognition, International Recognition
Araku coffee at G20 Summit

ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీని ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌ గిరిజన రైతులు పండించిన ప్రత్యేకమైన, అధిక నాణ్యాతా ప్రమాణాలు కలిగిన కాఫీని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదికను అందించింది. ఈ కాఫీ జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. కాఫీ రంగంలో వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా అందించింది. గిరిజనులు పండించిన అరకు కాఫీ రుచులను పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని జీసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Millets Export: చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ

 

Published date : 14 Sep 2023 12:47PM

Photo Stories