Andhra Pradesh: వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎటువంటి కాలుష్యం లేకుండా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 3,591 ఎకరాల్లో రూ.16,986 కోట్లతో అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్లాంట్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
చదవండి: ఈడబ్ల్యూఎస్ పేరుతో ప్రత్యేక శాఖకు ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేలా చర్యలు
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : జమ్మలమడుగు సమీపం, వైఎస్సార్ కడప జిల్లా
ఎందుకు : కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్