Skip to main content

OCTOPUS: అగ్ని పరీక్ష–7లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు?

DGP Goutam Sawang

జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) ఇటీవల హరియాణలో నిర్వహించిన ‘అగ్ని పరీక్ష–7’లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ (ఆక్టోపస్‌) విభాగం మొదటి స్థానాన్ని  దక్కించుకోవడంతో పాటు ఉత్తమ జట్టుగా నిలిచింది. అక్టోబర్‌ 12న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ విషయాలను తెలిపారు. ఎన్‌ఎస్‌జీతో పాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ బృందాలు ఇందులో పాల్గొనగా ఏపీ ఆక్టోపస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పాపారావు ఉత్తమ ప్రతిభ కనబరచి ఆల్‌ రౌండర్‌గా ఎంపికైనట్లు చెప్పారు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లు, వివిధ రకాల ఆయుధాలతో ఫైరింగ్, మారథాన్‌ రన్నింగ్, శారీరక ధారుడ్య పరీక్షల్లో ఏపీ ఆక్టోపస్‌ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు వివరించారు.

కన్నడ, హిందీలోనూ ఎస్వీబీసీ చానళ్లు

దేశ విదేశాల్లో ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను అక్టోబర్‌ 12న తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల గొల్ల మండపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో ఉన్న చానళ్ల ద్వారా టీటీడీ శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతోంది. మరోవైపు సహజ వ్యవసాయ పద్ధతులపై సీఎం జగన్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్, టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు.
 

చ‌ద‌వండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో గిరిజన మ్యూజియానికి శంకుస్థాపన చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) నిర్వహించిన అగ్ని పరీక్ష–7లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు?
ఎప్పుడు   : అక్టోబర్‌ 12
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ (ఆక్టోపస్‌) విభాగం
ఎక్కడ    : హరియాణ

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్

Published date : 13 Oct 2021 05:41PM

Photo Stories