Skip to main content

Adobe may set up centre for research at Osmania University: ఓయూలో అడోబ్‌ పరిశోధనాకేంద్రం

Adobe may set up centre for research at Osmania University
  • ఉస్మానియా క్యాంపస్‌లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్‌ ముందుకొచ్చిందని ఉస్మానియా యూని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ తెలి పారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్‌ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్‌ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ వివరాలను జూన్‌  10(శుక్రవారం) ఆయన ‘సాక్షి’తో ఫోన్‌ ద్వారా పంచుకున్నారు.
  • శాన్‌ ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణ్‌తో భేటీ అయినట్టు తెలిపారు. ఆర్టిఫీషి యల్‌ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉప యోగపడేలా ప్రతిపాదనలు రూపొందించాలని అడోబ్‌ సీఈవో కోరినట్టు తెలిపారు. శాన్‌ఫ్రాన్సి స్కోలో పలువురు పూర్వ విద్యార్థులను కలసి ఓయూ నిధుల సమీకరణపై చర్చించినట్టు చెప్పా రు. ఎంఐటీ, హార్వర్డ్‌ సహా ఇతర అమెరికన్‌ వర్సిటీలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్‌లను అధ్యయనం చేయాలని, ఉస్మాని యాకు సైతం ఓ క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని శంతను నారాయణ్‌ ప్రతి పాదించినట్టు రవీందర్‌ చెప్పారు.
  • ఓయూ మరో పూర్వవిద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్‌ మెటీరియల్‌ శాస్త్ర వేత్త, అప్లైడ్‌ వెంచర్స్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఓంకారం నలమాసతో కూడా చర్చించి నట్టు తెలిపారు. 21–పాయింట్స్‌ అజెండా, క్లస్టర్‌ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్‌లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కర ణల గురించి వివరించినట్టు చెప్పారు. సిలికాన్‌ వ్యాలీలో పన్నెండు మంది పూర్వ విద్యార్థులు, వివిధ కంపెనీల సీఈవోలతో భేటీ అయినట్టు చెప్పారు. ఓయూకు సహకరించేందుకు వారు సమ్మతిం చినట్టు తెలిపారు. 
  • Download Current Affairs PDFs: Click Here
Published date : 11 Jun 2022 06:02PM

Photo Stories