Skip to main content

Chief of Naval Staff: నేవీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైస్‌ అడ్మిరల్‌?

Vice Admiral R Hari Kumar

భారత నావికాదళం కొత్త అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ నవంబర్‌ 9న తెలిపింది. హరికుమార్‌ ప్రస్తుతం వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌–ఇన్‌–చీఫ్‌గా ఉన్నారు. 2021, నవంబర్‌ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నుంచి హరికుమార్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళకు చెందిన హరికుమార్‌కు కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రక్షనల్‌ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది.
 

చ‌ద‌వండి: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021, నవంబర్‌ 30వ తేదీన భారత నేవీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైస్‌ అడ్మిరల్‌?
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ 
ఎందుకు : నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Nov 2021 01:30PM

Photo Stories