Indian Navy: పశ్చిమ నౌకాదళాధిపతిగా నియమితులైన వ్యక్తి?
తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్ సింగ్ బదిలీ అయ్యారు. పశ్చిమ నౌకాదళాధిపతిగా ఆయనను నియమిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు నౌకాదళం తాత్కాలిక అధిపతిగా వైస్ అడ్మిరల్ బిస్వజిత్ సింగ్ దాస్‌గుప్తా వ్యవహరించనున్నారు. అధికారిక చీఫ్‌ని నియమించే వరకూ బిస్వజిత్ తూర్పు నౌకాదళాధిపతి బాధ్యతలను నిర్వహిస్తారు. పశ్చిమ నౌకాదళ ప్రధాన స్థావరం ముంబైలో ఉంది.
అక్సెల్‌సన్ ఖాతాలో ఆరో టైటిల్..
ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) తన ఖాతాలో ఆరో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. నవంబర్ 28న ఇండోనేసియాలోని బాలిలో ముగిసిన ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అక్సెల్‌సన్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో అక్సెల్‌సన్ 21–13, 9–21, 21–13తో లో కీన్ యె (సింగపూర్)పై గెలిచాడు.
చదవండి: ఇంటర్‌పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పశ్చిమ నౌకాదళాధిపతిగా నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్ సింగ్
ఎందుకు : ప్రభుత్వ నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్