Skip to main content

Dominic Raab: యూకే ఉప ప్రధాని రాబ్‌ రాజీనామా

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌కు అత్యంత సన్నిహితుడైన ఉప ప్రధానమంత్రి డొమినిక్‌ రాబ్‌(49) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 21న‌ ప్రధాని రిషి సునాక్‌కు లేఖ రాశారు.
Dominic Raab

రాబ్‌ ఇప్పటిదాకా న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. తన మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న సిబ్బందిని వేధింపులకు గురిచేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని రాబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. సివిల్‌ సర్వీసు అధికారులు సైతం ఆయనపై ఆరోపణలు చేశారు. దీనిపై ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. సీనియర్‌ న్యాయవాది ఆడమ్‌ టోలీ కేసీ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు పూర్తిచేసిన ఆడమ టోలీ కేసీ తన నివేదికను ఏప్రిల్ 20న‌ రిషి సునాక్‌కు అందజేశారు. నివేదికలో ఏం ఉందన్న విషయం ఇంకా బహిర్గతం కాలేదు. అయినప్పటికీ కొన్ని గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు డొమినిక్‌ రాబ్‌ ప్రకటించారు. డొమినిక్‌ రాబ్‌ స్థానంలో న్యాయ శాఖ మంత్రిగా జూనియర్‌ మినిస్టర్‌ అలెక్స్‌ చాక్‌ను నియమించారు. 

Femina Miss India 2023: ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా నందినీ గుప్తా

Published date : 22 Apr 2023 01:16PM

Photo Stories