Femina Miss India 2023: ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా నందినీ గుప్తా
Sakshi Education
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్– 2023గా రాజస్తాన్‌కు చెందిన నందినీ గుప్తా(19) ఎంపికయ్యారు.
మిస్ ఇండియా 2023 గ్రాండ్ ఫినాలే(59వ ఆడిషన్ ఫైనల్స్) మణిపుర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అందాల పోటీల్లో నందిని గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. కాగా ఫెమినా మిస్ ఇండియా పోటీలు భారత్‌లోనే అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్‌గా పరిగణిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఇందులో పాల్గొంటారు. మిస్ ఇండియాగా ఎంపికైన నందినీ గుప్తా మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 59వ ఆడిషన్ ఫైనల్స్‌లో ఢిల్లీకి చెందిన షెర్యా పూంజా ఫస్ట్ రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
Shah Rukh Khan: టైమ్ 100 అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్
Published date : 17 Apr 2023 03:25PM