Time Magazine: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన వ్యక్తి?
టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2021’గా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్ ఎక్స్‌కు కూడా మస్క్ సీఈవోగా ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి మస్క్ ఇటీవలే ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయన సంపద దాదాపు 300 బిలియన్ డాలర్లు ఉంటుంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి. సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.
చదవండి: ప్రైడ్, ప్రిజుడీస్ అండ్ పండిట్రీ పుస్తక రచయిత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2021’గా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : టెస్లా సీఈవో ఎలన్ మస్క్
ఎక్కడ : ప్రపంచంలో..
ఎందుకు : అత్యంత ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపుపొందిన...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్