Former Minister: ప్రైడ్, ప్రిజుడీస్ అండ్ పండిట్రీ పుస్తక రచయిత?
నాన్ ఫిక్షన్ రచనలు చాలా సులువైనవని, వ్యక్తిగతంగా తనకు ఫిక్షన్ రచనలంటేనే ఇష్టమని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ రచయిత శశిథరూర్ అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ పార్క్‌హయత్‌లో ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశిథరూర్ స్వయంగా రాసిన ‘ప్రైడ్, ప్రిజుడీస్ అండ్ పండిట్రీ’ అనే పుస్తకాన్ని డిసెంబర్ 11న ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... తన 23వ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. అలెఫ్ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ముందుగా ఢిల్లీలో ఆవిష్కరించారు.
సుప్రీంలో సీనియర్ హోదా పొందిన తొలి తెలంగాణ న్యాయవాది?
తెలంగాణకు చెందిన న్యాయవాది పి.నిరూప్ రెడ్డికి సుప్రీంకోర్టు ఫుల్‌కోర్టు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ హోదా పొందిన తొలి తెలంగాణ న్యాయవాదిగా నిరూప్ రెడ్డి గుర్తింపు పొందారు. మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి కుమారుడైన నిరూప్‌రెడ్డి 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు చట్టాలపై మంచి పట్టును సాధించారు.
చదవండి: పెన్‌స్టేట్ వర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్