Indian-origin: పెన్‌స్టేట్ వర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ?
అమెరికాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఏయూ పూర్వవిద్యార్థిని నీలి బెండపూడి నియమితులయ్యారు. డిసెంబర్ 9న జరిగిన పెన్సిల్వేనియా (పెన్‌స్టేట్) యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఏకగ్రీవంగా నీలి బెండపూడిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. దీంతో 2022, జనవరిలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నీలి బెండపూడి యూనివర్సిటీ ఆఫ్ లూయిన్ విల్లీ కెంటగీ అధ్యక్షురాలిగా, మార్కెటింగ్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నీలి బెండపూడి విశాఖ నగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా స్వీకరించారు. అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
ప్రజాస్వామ్యంపై సదస్సు..
ప్రజాస్వామ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించిన ఆన్‌లైన్ సదస్సులో డిసెంబర్ 11న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. క్రిప్టోకరెన్సీ, సోషల్ మీడియా లాంటి వర్ధమాన సాంకేతికతల నియంత్రణకు అంతర్జాతీయ నిబంధనలు తీసుకువచ్చేందుకు అన్ని దేశాలూ సంయుక్తంగా కృíషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
చదవండి: వికీలీక్స్ వ్యవస్థాపకుడు ఎవరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ఏయూ పూర్వవిద్యార్థిని నీలి బెండపూడి
ఎక్కడ : పెన్సిల్వేనియా, అమెరికా
ఎందుకు : పెన్సిల్వేనియా (పెన్‌స్టేట్) యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్