London High Court: వికీలీక్స్ వ్యవస్థాపకుడు ఎవరు?
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను యూకే నుంచి యూఎస్‌కు అప్పగించడానికి లండన్ హైకోర్టు డిసెంబర్ 10న అనుమతినిచ్చింది. 2010–11 కాలంలో పలు రహస్య మిలటరీ, ద్వైపాక్షిక డాక్యుమెంట్లను బహిర్గతం చేసినందుకు అమెరికా అసాంజేను వెంటాడుతోంది. దీంతో అమెరికా నుంచి తప్పించుకున్న అసాంజే 2012 నుంచి యూకేలోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో శరణార్థ్ధిగా గడుపుతున్నారు. బెయిల్ కండీషన్లను ఉల్లంఘించారన్న ఆరోపణలపై 2019లో రాయబార కార్యాలయం నుంచి అసాంజేను అరెస్టు చేసి లండన్‌లోని బెలమార్ష్ జైల్లో ఉంచారు.
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు వందల మందికిపైగా వలసదారులతో పయనిస్తున్న ట్రక్కు బోల్తాపడి మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో డిసెంబర్ 9న జరిగిన ఈ ప్రమాదంలో 53 మంది మరణించగా, 54 మందికి గాయాలయ్యాయి. పాదచారుల కోసం నిర్మించిన బ్రిడ్జిని ట్రక్కు ఢీకొని బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిలో అత్యధికులు గ్యాటిమాలా, హోండూరస్ నుంచి మెక్సికోకు వచ్చినవారున్నారు. వీరంతా మెక్సికో నుంచి యూఎస్ వెళ్లేందుకు ప్రయాణిస్తున్నారు.
మెక్సికో..
రాజధాని: మెక్సికో సిటీ; కరెన్సీ: మెక్సికన్ పెసో
ప్రస్తుత అధ్యక్షుడు: ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్
చదవండి: ఎల్గార్ పరిషత్ కేసులో జైలు నుంచి విడుదలైన మహిళా న్యాయవాది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్