Skip to main content

Elon Musk: ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్‌ మస్క్‌

టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ అగ్ర స్థానానికి చేరుకున్నారు.
Tesla ceo elon musk

ఇప్ప‌టి వ‌ర‌కు మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించాడు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచాడు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో టెక్ పరిశ్రమ కష్టాల కారణంగా ఆర్నాల్ట్ డిసెంబర్‌లో మస్క్‌ను అధిగమించారు. అయితే ఎట్టకేలకు మళ్ళీ ఆ స్థానాన్ని మస్క్ సొంతం చేసుకున్నారు. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఇప్పుడు రెండవ స్థానానికి చేరిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ నుంచి ఎల్‌వీఎంహెచ్ (LVMH) షేర్లు క్రమంగా తగ్గుముఖం పట్టి 10 శాతం పడిపోయాయి. ఈ కారణంగా ఆర్నాల్డ్ నికర విలువ ఒక్క రోజులోనే 11 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు.

World's Slowest Student: వామ్మో డిగ్రీ పూర్తి చేయడానికి 54 ఏళ్లా.. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డు..!

Published date : 02 Jun 2023 03:41PM

Photo Stories