Justice Narendar: ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ నరేందర్
జస్టిస్ నరేందర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన 2023 అక్టోబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం, ఆయన ఏపీ హైకోర్టులో జడ్జీల సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్నారు.
కర్ణాటక నుంచి హైకోర్టు సీజేగా ప్రాతినిధ్యం లేని కారణంగా, జస్టిస్ నరేందర్‌ను ఉత్తరాఖండ్ సీజేజిగా నియమించాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ రీతూ బారీ అక్టోబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ నరేందర్ 1964 జనవరి 10న తమిళనాడులో జన్మించారు. 1989లో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. 1989లో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో నమోదు చేసి, 1993లో కర్ణాటకకు చేరారు. 2015లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2017లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Women CMs: భారతదేశంలో సీఎం పీఠంపైకి ఎక్కిన 17 మంది మహిళలు వీరే..