Sri Lankan President: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దిస్సనాయకే
రాష్ట్రపతి సచివాలంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య దస్సనాయకేతో ప్రమాణం చేయించారు. కాగా శ్రీలంకకు అనూర కుమార దిస్సనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్‌లోనే వైదొలిగారు.
దిస్సనాయకే చరిత్ర ఇదే..
ఏకేడీగా పిలుచుకునే అనూర దిస్సనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్‌లోని థంబుట్టెగామలో జన్మించారు. కొలంబో సమీపంలోని కెలనియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. 1987లో జేవీపీలో చేరారు. 1971, 1987, 1990ల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు జేవీపీ హింసా మార్గం తొక్కింది. ఇది భారత వ్యతిరేకి కూడా. అప్పట్లో రాజీవ్ గాంధీ–జయవర్థనే ప్రభుత్వాల ఒప్పందం శ్రీలంక సార్వబౌమత్వానికి భంగకరమని భావించేది.
గత ఫిబ్రవరిలో దిస్సనాయకే భారత్‌లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పువచ్చింది. 90ల్లో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పార్టీలో దిస్సనాయకేకు ప్రాధాన్యం పెరిగింది. 2000 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు. 2014లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 2019 ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే.