Skip to main content

Sitiveni Rabuka: ఫిజీ ప్రధానిగా రబుకా

ఫిజీ ప్రధానిగా మాజీ మిలటరీ కమాండర్‌ సిటివెని రబుకా (74) డిసెంబ‌ర్ 24న ప్రమాణం చేశారు.
Sitiveni Rabuka

పీపుల్స్‌ అలయెన్స్ పార్టీకి చెందిన ఆయన మరో రెండు పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 14న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. 16 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న ఫ్రాంక్‌ బైనిమరామ వైదొలిగేందుకు నిరాకరించడంతో ఉత్కంఠ కొనసాగింది. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంలో రబుకా ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఫిజీలో గత 35 ఏళ్లలో నాలుగుసార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

Published date : 26 Dec 2022 12:56PM

Photo Stories