Miss Universe 2023: విశ్వసుందరిగా షెన్నిస్ పలాసియోస్
Sakshi Education
నికరాగువా భామ షెన్నిస్ పలాసియోస్ విశ్వసుందరి 2023 కిరీటం కైవసం చేసుకుంది.
మాజీ విశ్వసుందరి ఆర్ బానీ గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని షెన్నిస్‌కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ అందాల పోటీలో నికరాగువాకు ఇదే తొలి విజయం. శాన్ సాల్వడార్ వేదికగా ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్–2023 పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ కాగా.. ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్ గా నిలిచారు. మన దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా మొదటి 20మందిలో నిలిచారు.
Mrs Singapore 2023: మిసెస్ సింగపూర్–2023 పోటీల్లో విజేతగా వైఎస్సార్ జిల్లా మహిళ
Published date : 29 Nov 2023 05:50PM