Senior journalist: ఇండియా మార్ట్‌గేజ్డ్ పుస్తకాన్ని ఎవరు రచించారు?
సీనియర్ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్ (78) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 8న తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన శ్రీరంగనాథ్ పాత్రికేయ ప్రస్థానం నాలుగు దశాబ్దాల పాటు సాగింది. ఉదయం దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్‌గా, వార్త దిన పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా, ఏపీ టైమ్స్ ఆంగ్ల పత్రిక బ్యూరో చీఫ్‌గా, ఆంధ్రప్రభ దినపత్రిక న్యూస్ నెట్ వర్క్ ఇన్‌ఛార్జిగా, సాక్షి దినపత్రిక కాలమిస్ట్‌గా పనిచేశారు. కమ్యూనిస్ట్ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ‘‘ఇండియా మార్ట్‌గేజ్డ్’’ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్ ‘‘తాకట్టులో భారతదేశం’’ పేరుతో అనువదించారు.
ఆర్‌బీఐ సమీక్షా సమావేశం ప్రారంభం
గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) చిట్టచివరి, ఆరవ ద్వైమాసిక సమావేశం ఇది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది.
చదవండి: జేఎన్‌యూ వీసీగా నియమితులైన తొలి మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీనియర్ పాత్రికేయుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : నిమ్మకాయల శ్రీరంగనాథ్ (78)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్