Jawaharlal Nehru University: జేఎన్‌యూ వీసీగా నియమితులైన తొలి మహిళ?
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నూతన ఉపకులపతి(వీసీ)గా తెలుగు మహిళ డాక్టర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్(59) నియమితులయ్యారు. దీంతో జేఎన్‌యూ వీసీగా నియమితులైన తొలి మహిళగా శాంతిశ్రీ రికార్డుకెక్కారు. ఐదేళ్లు జేఎన్‌యూ వీసీగా సేవలందించిన తెలంగాణవాసి ఎం.జగదీష్ కుమార్ 2021 ఏడాది ఆఖర్లో పదవీ విరమణ పొందిన నేపథ్యంలో.. శాంతిశ్రీని నూతన వీసీగా నియమించారు. ఈ మేరకు శాంతిశ్రీ నియామకానికి రాష్ట్రపతి, జేఎన్‌యూ విజిటర్ రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు ఫిబ్రవరి 7న వెల్లడించారు. మహారాష్ట్రలోని సావిత్రిభాయి ఫూలే పుణే యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీ జేఎన్‌యూ వీసీ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఆమె గతంలో జేఎన్‌యూ నుంచి ఎంఫిల్, పీహెచ్‌డీ అందుకున్నారు.
- శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ 1962 జూలై 15న రష్యాలోని (అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్) సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు.
- ఆమె తండ్రి డాక్టర్ ధూళిపూడి ఆంజనేయులు రచయిత, జర్నలిస్టు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అమృతలూరు మండలంలోని యలవర్రు.
- శాంతిశ్రీ తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్‌గ్రాడ్ ఓరియంటల్ ఫ్యాకల్టీ డిపార్టుమెంట్‌లో తమిళం, తెలుగు భాషల ప్రొఫెసర్‌గా పనిచేశారు.
- శాంతిశ్రీ మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1983లో హిస్టరీ, సోషల్ సైకాలజీలో బీఏ డిగ్రీ అందుకున్నారు.
- 1985లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ(ఎంఏ) డిగ్రీ పొందారు.
- 1990లో జేఎన్‌యూకు చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ‘పార్లమెంట్, ఫారిన్ పాలసీ ఇన్ ఇండియా–ద నెహ్రూ ఇయర్స్’పై పీహెచ్‌డీ డాక్టరేట్ అందుకున్నారు.
- ఉన్నత విద్యావంతురాలైన శాంతిశ్రీ ధూళిపూడి ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. కన్నడం, మలయాళం, కొంకణీ భాషలను అర్థం చేసుకోగలరు.
ఎన్నెన్నో పురస్కారాలు..
- శాంతిశ్రీ పలు అంశాల్లో 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
- మద్రాసు పెసిడెన్సీ కాలేజీ నుంచి 1980–81, 1981–82, 1982–83, 1983–84, 1984–85లో ఎల్ఫిన్‌స్టోన్ ప్రైజ్. ఈ ప్రైజ్‌ను ఎక్కువసార్లు (ఐదుసార్లు) గెలుచుకున్న రికార్డు ఇప్పటికీ శాంతిశ్రీ పేరిటే ఉంది.
- 1998లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్‌కు చెందిన సెంటర్ ఫర్ సౌత్ ఆసియన్ డీస్ నుంచి ఫెలోషిప్. ఆస్ట్రియా నుంచి మరో ఫెలోషిప్.
విద్యా రంగానికి సేవలు
- 1988లో గోవా యూనివర్సిటీలో బోధనా వృత్తిని ఆరంభించారు.
- 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ సెనేట్ సభ్యురాలిగా, 2001 నుంచి 2007 వరకూ ఇంటర్నేషనల్ సెంటర్ డైరెక్టర్‌గా, 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు.
- చైనాలోని హూనన్ వర్సిటీలో ఆసియన్ అండ్ యూరోపియన్ స్టడీస్ రిసోర్స్‌పర్సన్‌గా విధులు.
- యూజీసీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్(ఐసీఎస్‌ఎస్‌ఆర్) సభ్యురాలిగా పని చేశారు.
కరెంట్ అఫైర్స్ ( ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (08-14, January, 2022)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీలోని జేఎన్‌యూ ఉపకులపతి(వీసీ)గా నియమితులైన తొలి మహిళ?
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : తెలుగు మహిళ డాక్టర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్(59)
ఎందుకు : జేఎన్‌యూ వీసీగా సేవలందించిన తెలంగాణవాసి ఎం.జగదీష్ కుమార్ 2021 ఏడాది ఆఖర్లో పదవీ విరమణ పొందడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్