Prince Harry: కోర్టుకు హాజరైన ప్రిన్స్ హ్యారీ.. 130 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి

విట్‌నెస్ బాక్స్‌లో నిలబడి సాక్ష్యం చెప్పారు. బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ఇలా కోర్టుకు హాజరుకావడం దాదాపు 130 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్(ఎంజీఎన్) మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఫోన్ హ్యాకింగ్‌తోపాటు చట్టవ్యతిరేక పద్ధతుల్లో ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
మిర్రర్ గ్రూప్ నిర్వాకంపై ప్రిన్స్ హ్యారీతోపాటు వంద మందికిపైగా ప్రముఖులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే హ్యారీ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. మిర్రర్ గ్రూప్ వల్ల తన జీవితం తీవ్రంగా ప్రభావితమైందని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. తనను ఒక మోసగాడిగా, తాగుబోతుగా, డ్రగ్స్ తీసుకొనే చిల్లర వ్యక్తిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొన్నారు.
US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా 14 ఏళ్ల భారత సంతతి దేవ్ షా