Skip to main content

Bilateral Negotiations: ప్రధానీ మోదీ.. బ్రూనై సుల్తాన్‌ హసనల్‌ బొల్కియాతో ద్వైపాక్షిక చర్చలు

ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మోదీ సెప్టెంబ‌ర్ 4వ తేదీ బ్రూనై సుల్తాన్‌ హసనల్ బొల్కియాతో సమావేశమయ్యారు.
PM Narendra Modi, Brunei Sultan Haji Hassanal Bolkiah discuss ways to further strengthen bilateral ties

భారత్‌–బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఆహార భద్రత, విద్య, ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల వంటి కీలక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చాలని, వివిధ నూతన రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కలిసి పని చేస్తేనే ఇరు దేశాలకు మేలు జరుగుందని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మోదీ, సుల్తాన్‌ హసనల్ బొల్కియా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. 

భారత్, బ్రూనై మధ్య లోతైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రెండు దేశాల నడుమ దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు నిండుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించామన్నారు. ఆగ్నేయ ఆసియా దేశాల కోసం ఒక ప్రవర్తనా నియామవళిని ఖరారు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని వివరించారు.

PM Modi: బ్రూనైలో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని ప్రారంభించిన మోదీ

యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ద లా ఆఫ్‌ ద సీ–1982(అన్‌క్లాస్‌) తరహాలో ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో నౌకలు, విమానాల స్వేచ్ఛా విహారానికి ఒక తీర్మానం ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  

బ్రూనై అత్యంత కీలక భాగస్వామి  
భారతదేశ ‘తూర్పు కార్యాచరణ’, ఇండో–పసిఫిక్‌ దార్శనికత విషయంలో బ్రూనై తమకు అత్యంత కీలక భాగస్వామి అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. బ్రూనై సుల్తాన్‌తో సమగ్ర చర్చలు జరిపామని, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని తీర్మానించామని చెప్పారు. ఫిన్‌టెక్, సైబర్‌ సెక్యూరిటీ, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్, ఆరోగ్యం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. 

ఉపగ్రహాలు, ఉపగ్రహ ప్రయోగ వాహనాల కోసం టెలిమెట్రీ, ట్రాకింగ్, టెలికమాండ్‌ స్టేషన్‌ నిర్వహణ విషయంలో సహకరించుకోవడానికి భారత్, బ్రూనై ఒక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి.

PM Modi Poland Visit: పోలెండ్‌లో పర్యటించిన మోదీ.. ఆ దేశ ప్రధానితో సమావేశం.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

Published date : 05 Sep 2024 04:04PM

Photo Stories