Nanda Kishore Prusty: ప్రముఖ ఉపాధ్యాయుడు, పద్మశ్రీ అవార్డీ నంద కన్నుమూత
ప్రముఖ ఉపాధ్యాయుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నంద కిశోర్ పృష్టి(104) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో డిసెంబర్ 7న తుదిశ్వాస విడిచారు. ఒడిశాలోని జాజ్‌పుర్ జిల్లా కంత్రిగా గ్రామానికి చెందిన నంద... 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక విద్యాభ్యాసాన్ని ఆపేశారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించారు. ఎందరో పేద చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. 74 ఏళ్లపాటు ఉచితంగా పాఠాలు బోధించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
చదవండి: జర్మనీ నూతన చాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ ఉపాధ్యాయుడు, పద్మశ్రీ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : నంద కిశోర్ పృష్టి(104)
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : అనారోగ్యం కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్