Odisha: రాష్ట్రంలో తొలి గిరిజన ముఖ్యమంత్రిగా పేరొందిన వ్యక్తి?
ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్(82) ఇకలేరు. పలు అనారోగ్య సమస్యలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచారు. ఒడిశా రాష్ట్ర, ఝార్సుగుడ జిల్లా, ఠకురొపొడా గ్రామంలో 1939 డిసెంబర్ 1వ తేదీన జన్మించిన హేమానంద ఒడిశా రాష్ట్రంలో తొలి గిరిజన ముఖ్యమంత్రిగా పేరొందాడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తొలుత 1989 డిసెంబర్ 7వ తేదీ నుంచి 1990 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండోసారి 1999 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2000 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
చదవండి: ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : హేమానంద బిశ్వాల్(82)
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : అనారోగ్య సమస్యలతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్