NTR Rs.100 Coin ceremony: ఎన్టీఆర్ రూ.100 స్మారణ నాణేం విడుదల
Sakshi Education
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నట దిగ్గజం, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నందమూరి తారకరామారావు పేరిట రూ.100 స్మారణ నాణేం విడుదల అయ్యింది.
సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవల గుర్తింపుగా నాణేం విడుదల చేశారు. ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన అనంతరం రాష్ట్రపతి దౌపది ముర్ము మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌గారు రామాయణ ,మహాభారతాలకు అనేక పాత్రలలో ఎన్టీఆర్ జీవించారు. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో ఇచ్చారు. రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది’’ అని తెలిపారు.
Who is TATA's Business Successor: 'టాటా' వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరు?
Published date : 29 Aug 2023 12:45PM