RBI: ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 వెండి నాణెం
Sakshi Education
ప్రముఖ తెలుగు సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముఖచిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది.
ఈ నాణెం మరో 2 నెలల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. దీని కొనుగోలుకు రిజర్వు బ్యాంకు కౌంటర్ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాలి. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున జింకు, నికెల్ కలిపి ఈ నాణెం తయారు చేయనున్నారు.
ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఇలాంటి నాణేలను రిజర్వు బ్యాంకు విడుదల చేస్తుంది. గతంలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి చిత్రంతో ఇలా నాణెం విడుదల చేసింది. ఎన్టీఆర్ చిత్రంతో నాణెంతో పాటు ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను చిన్న పుస్తకంలా 4 పేజీల్లో ముద్రించి కొనుగోలుదారులకు అందజేస్తారు.
Telangana Budget 2023-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023-24
Published date : 18 Feb 2023 02:04PM