Bappi Lahiri: ప్రముఖ గాయకుడు బప్పీ లహిరి ఇక లేరు
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పీ లహిరి(69) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ముంబైలోని జుహూలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 16న తుదిశ్వాస విడిచారు. 1952 నవంబర్ 27న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, జల్‌పాయ్‌గురి జిల్లా, జల్‌పాయ్‌గురి నగరంలో జన్మించిన బప్పి.. అసలు పేరు అలోకేష్ లహిరి. ‘బప్పీ దా’ అని అందరూ ఆత్మీయంగా పిలుచుకునే బప్పీ లహిరి.. తన మొత్తం కెరీర్‌లో 460 హిందీ, తెలుగు, బెంగాలీ, తమిళ, కన్నడ సినిమాలకు పని చేశారు. తెలుగులో సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరిగా డిస్కో రాజా చిత్రంలో పాటపాడారు. కాగా 2014లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి, ఓడిపోయారు.
చదవండి: బంగ బిభూషణ్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : బప్పీ లహిరి(69)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : వయో సంబంధిత సమస్యలతో..