Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రస్థానం..
దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అపోలో అసుపత్రికి తీసుకొచ్చి చివరి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.
తన తండ్రి అడుగు జాడల్లో..
మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. అనంతరం 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నర్సరావు పేట, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు. గౌతమ్‌రెడ్డి బాబాయ్ చంద్రశేఖర్‌రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా 2004, 2009, 2012ల్లో ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.