Skip to main content

Praveen Sood: సీబీఐ నూతన డైరెక్టర్‌గా డీజీపీ ప్రవీణ్‌ సూద్‌

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ ఎంపికయ్యారు. ఈయన రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
Karnataka DGP Praveen Sood

1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌ సూద్‌.. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవికాలం పూర్తయిన తర్వాత ఆయన నుంచి సూద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ పలవురు పేర్లను పరిశీలించి ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ఎంపిక చేసింది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై తదుపరి సీబీఐ డైరెక్టర్ పదవికి కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్య ప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఎంపిక చేసింది. వీరిలో కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఖరారయ్యారు. 

Charles 3: అంగరంగ వైభవంగా చార్లెస్‌ పట్టాభిషేకం.. బ్రిటన్ 40వ రాజుగా ప్రమాణస్వీకారం
పదవీ కాలం రెండేళ్లు..
కాగా సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైనవారి పదవీ కాలం రెండేళ్లు. అయితే ఈ పదవీ కాలన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్ సభ్యుడు పదవుల కోసం అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న జైశ్వాల్‌.. 1985 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్‌. గతంలో ముంబై పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2021 మే 26న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబోధ్‌ కుమార్‌ రెండేళ్ల పదవీకాలం మే 25తో పూర్తికానుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)

Published date : 15 May 2023 12:11PM

Photo Stories