వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
1. అదానీ పవర్ లిమిటెడ్ ప్రారంభించిన కొత్త పవర్ ప్లాంట్ జార్ఖండ్ నుంచి ఏ దేశానికి విద్యుత్ ను సరఫరా చేస్తుంది?
ఎ. మయన్మార్
బి. నేపాల్
సి. భూటాన్
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: డి
2. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించడానికి యుఏఇతో ఏ దేశం ముందుకొచ్చింది?
ఎ. జపాన్
బి. వియత్నాం
సి. ఒమన్
డి. ఖతార్
- View Answer
- Answer: బి
3. రవాణా, ఇంధనం, వ్యవసాయం, సంస్కృతి, సైన్స్ వంటి రంగాలలో ఆర్థిక ఒప్పందాలను ఫ్రాన్స్‌తో ఏ దేశం కుదుర్చుకుంది?
ఎ. భూటాన్
బి. జర్మనీ
సి. చైనా
డి. USA
- View Answer
- Answer: సి
4. ఉక్రెయిన్ యుద్ధ ఫైళ్ల లీక్‌పై ఏ దేశం దర్యాప్తు ప్రారంభించింది?
ఎ. ఉగాండా
బి. USA
సి. UK
డి. UAE
- View Answer
- Answer: బి
5. భారతదేశం, బంగ్లాదేశ్, జపాన్ ఏ రాష్ట్రంలో కనెక్టివిటీ సమావేశాలను నిర్వహించాయి?
ఎ. బీహార్
బి. త్రిపుర
సి. తెలంగాణ
డి. మిజోరాం
- View Answer
- Answer: బి
6. ఉమ్మడి విన్యాసాలు 'ఓరియన్-23(Orion-23)' ఏ దేశంలో నిర్వహించారు?
ఎ. ఫ్రాన్స్
బి. రష్యా
సి. ఆస్ట్రేలియా
డి. ఈజిప్ట్
- View Answer
- Answer: ఎ
7. డ్నీపర్ నదిపై జపోరిజ్జియా నగరానికి సమీపంలో 70,000 టన్నుల ఇంధన డిపోను ఏ దేశం ధ్వంసం చేసింది?
ఎ. చైనా
బి. రష్యా
సి. USA
డి. UK
- View Answer
- Answer: బి
8. పాకిస్తాన్ లోని మహ్మంద్ బహుళార్ధసాధక ఆనకట్ట ప్రాజెక్ట్ కోసం ఏ దేశం ఆర్థిక సహాయం అందిస్తోంది?
ఎ. USA
బి. చైనా
సి. సౌదీ అరేబియా
డి. UAE
- View Answer
- Answer: సి
9. తైవాన్ను చుట్టుముట్టి 'ఆపరేషన్ జాయింట్ స్వోర్డ్'ను ఏ దేశం నిర్వహించింది?
ఎ. చైనా
బి. ఉత్తర కొరియా
సి. జపాన్
డి. ఇండోనేషియా
- View Answer
- Answer: ఎ
10. రాబిట్ హెమరేజిక్ డిసీజ్ ఏ దేశంలో ప్రబలంగా వ్యాపిస్తోంది?
ఎ. క్యూబా
బి. అమెరికా
సి. స్విట్జర్లాండ్
డి. న్యూజిలాండ్
- View Answer
- Answer: డి
11. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వారణాసిలో "తులసి ఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్"ని ఏ దేశం నుంచి ప్రారంభించారు?
ఎ. కువైట్
బి. బహ్రెయిన్
సి. ఉగాండా
డి. ఖతార్
- View Answer
- Answer: సి
12. సాగర్ మిషన్‌కు అనుగుణంగా INS తార్ముగ్లీని ఏ దేశానికి పంపిస్తున్నారు?
ఎ. మాల్దీవులు
బి. మలేషియా
సి. ఉక్రెయిన్
డి. స్పెయిన్
- View Answer
- Answer: ఎ
13. శ్రీలంక రుణ పునర్నిర్మాణాన్ని సమన్వయం చేయడానికి ద్వైపాక్షిక రుణదాతల మధ్య చర్చలు జరిపేందుకు జపాన్, భారతదేశంతో పాటు ఏ దేశం ఒక ఉమ్మడి వేదికను ప్రకటించింది?
ఎ. నేపాల్
బి. ఫ్రాన్స్
సి. చైనా
డి. శ్రీలంక
- View Answer
- Answer: బి
14. ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)లో భాగంగా ఏదేశానికి 10 వేల టన్నుల గోధుమలను పంపేందుకు భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. సింగపూర్
బి. చైనా
సి. ఆఫ్ఘనిస్తాన్
డి. పాకిస్తాన్
- View Answer
- Answer: సి
15. రెండు సంవత్సరాల తర్వాత ఖతార్‌తో తమ దౌత్య సంబంధాలను పునఃప్రారంభించనున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
ఎ. బహమాస్
బి. క్యూబా
సి. బహ్రెయిన్
డి. మాలి
- View Answer
- Answer: సి
16. తొలి గ్లోబల్ బౌద్ధ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది?
ఎ. భారతదేశం
బి. జపాన్
సి. వియత్నాం
డి. కంబోడియా
- View Answer
- Answer: ఎ
17. క్రిప్టో సంస్థలకు లైసెన్స్ ఇవ్వడానికి ఇటీవల ఏ దేశం చొరవ చూపించింది?
ఎ. ఇటలీ
బి. ఎల్ సాల్వడార్
సి. ఈక్వెడార్
డి. UAE
- View Answer
- Answer: బి