Skip to main content

Puneeth Rajkumar: కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం

Puneeth Rajkumar


ప్రముఖ కన్నడ నటుడు, గాయకుడు, డ్యాన్సర్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత పునీత్‌ రాజ్‌కుమార్‌(46) ఇకలేరు. అక్టోబర్‌ 29న బెంగళూరులోని తన నివాసంలో జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. 1975 మార్చి 17న చెన్నైలో రాజ్‌కుమార్‌(కన్నడ కంఠీరవ), పార్వతమ్మ దంపతులకు జన్మించిన పునీత్‌కు తొలుత లోహిత్‌ అనే పేరు పెట్టారు. తదనంతర కాలంలో పునీత్‌గా పేరు మార్చారు.

1800 మంది విద్యార్థులకు సాయంగా..

కన్నడ పవర్‌స్టార్‌గా పేరొందిన పునీత్‌.. స్వస్థలం చామరాజనగర జిల్లా గాజనూరు. పసికందుగా ఉన్నప్పుడే ‘ప్రేమద కానికే’ (1976) చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచమయ్యాడు. బాలనటుడిగా చాలా చిత్రాల్లో నటించడంతోపాటు... కర్నాటక ప్రభుత్వం నుంచి రెండు సార్లు, భారత ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ బాల నటుడి అవార్డును అందుకున్నారు. 2002 ఏడాదిలో ‘అప్పుు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటినుంచి ఆయన్ను ప్రేక్షకులు ‘అప్పు’ అని పిలవడం మొదలుపెట్టారు. హీరోగా దాదాపు 30 చిత్రాల్లో నటించారు. తండ్రి రాజ్‌కుమార్‌పై ‘డాక్టర్‌ రాజ్‌కుమార్‌: ది పర్సన్‌ బిహైండ్‌ ది పర్సనాలిటీ’ అనే పుస్తకాన్ని పునీత్‌ రాశారు. దాదాపు 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలకు పునీత్‌ సాయం అందిస్తూ వచ్చారు. ‘శక్తిధామ’ అనే సంస్థ ఆధ్వర్యంలో చదువుకుంటున్న దాదాపు 1800 మంది విద్యార్థులకు సాయంగా ఉన్నాడు.


చ‌ద‌వండి: ఇటీవల కన్నుమూసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రముఖ కన్నడ నటుడు, గాయకుడు, డ్యాన్సర్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత కన్నుమూత 
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు     : పునీత్‌ రాజ్‌కుమార్‌(46)
ఎక్కడ    : విక్రమ్‌ ఆస్పత్రి, బెంగళూరు
ఎందుకు : గుండెపోటు కారణంగా...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Oct 2021 05:54PM

Photo Stories