Indian Woman: 99 ఏళ్లకు అమెరిన్ సిటిజన్‌గా భారతీయ బామ్మ
Sakshi Education
భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు.
ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనడానికి 99 ఏళ్ల దైబాయి నిదర్శనం. మా ఓర్లాండో కార్యాలయానికి ఆమె ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు’ అని యూఎస్‌సీఐఎస్ పోస్టు చేసింది. దైబాయికి అమెరికా పౌరసత్వం లభించడం పట్ల పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు.
Juan Vicente Perez Mora: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
Published date : 08 Apr 2024 04:17PM