PM Trudeau Cabinet: కెనడా రక్షణ మంత్రిగా నియమితులైన భారత సంతతి మహిళ?
కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ (53) నియమితులయ్యారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కేబినెట్‌లో రక్షణ మంత్రిగా ఇండో కెనడియన్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు కెనడా దేశ చరిత్రలో ఒక మహిళ రక్షణ మంత్రి కావడం ఇది రెండోసారి. గత రక్షణ మంత్రి హర్‌జిత్ సజ్జన్ కూడా భారత సంతతికి చెందిన వారే. 2019లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన అనితా ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓక్‌విల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
కొత్త పార్టీ ప్రకటన చేసిన మాజీ సీఎం?
కొత్త పార్టీ పెడుతున్నట్టు పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అక్టోబర్ 27న ప్రకటించారు. పార్టీ పేరు, గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తెలిపిన అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీకి 2022, ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరగనున్నాయి.
చదవండి: రాచరిక హోదాను వదులుకున్న జపాన్ యువరాణి పేరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెనడా రక్షణ మంత్రిగా నియమితులైన భారత సంతతి మహిళ?
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అనితా ఆనంద్
ఎందుకు : కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిర్ణయం మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్